Tuesday, December 27, 2016

శాకాహారులలో Vitamin B12. ఉండదా?

శాకాహారులలో Vitamin B12. ఉండదా?

మన సంస్కృతిలో

ఇప్పుడు ప్రజలు ఎదురుకంటున్న ఆరోగ్యసమస్యల్లో ఒకటి బి 12 విటమిన్ లోపించడం. వినడానికి ఏదో ఒక చిన్న విటమిన్ లోపంగానే అనిపిస్తుంది కానీ, అది లోపిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. నాడీసంబంధం సమస్యలు చాలా తీవ్రంగా వస్తాయి. ఈ మధ్య ఇది చాలా ఎక్కువైంది. ఇది లోపించినవారు పడే బాధ, నొప్పులు వర్ణానతీతం. చాలామంది ఆసుపత్రిలో చేరి సిలైన్లు, ఇంజెక్షన్లు తీసుకుని చికిత్స చేయించుకున్నారు. ఇలాంటి వారిని నేను ప్రత్యక్షంగా చూశాను.

డాక్టర్లు, ఫార్మా కంపెనీలు అంటాయి, బి 12 లోపం శాఖాహారులకు తప్పకుండా కలుగుతుంది, ఈ విటమిన్ మాంసాహారంలోనే అధికంగా ఉంటుంది, శాఖాహారులు ఖచ్చితంగా ఇంజెక్షన్లు తీసుకోవాలి అని. ఇదే విషయం మీద నా మిత్రుడు, అనీల్ కిషన్ పురాతన ఆయుర్వేద (AYURVEDA) గ్రంధాలపై పరిశోధన చేస్తున్నారు. వారంటారు 'మాంసాహారం తినే పులితో పోల్చుకున్నప్పుడు, బరువు తక్కువగా ఉన్న మేక లేదా జింకలో బి12 అధికంగా ఉంటుంది. సమస్య శాఖాహారంలో లేదు, అందులో సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్లనే వస్తోంది. పైగా మాంసాహారంలో ఉండే బి12, ఆహారం వండే సమయంలోనే చాలా శాతం నశించిపోతుంది.

ఈ బి 12 అనేది మట్టిలో అధికంగా ఉంటుంది, మీకు ఎప్పుడైనా వెంటనే బి 12 రావాలంటే మట్టిలో పని చేయాలి, మట్టి పిసకడమో, మొక్కలు నాటడమో, లేద మట్టి తొక్కడమో చేయాలి. అప్పుడు ఇంజెస్కన్ కంటే వేగంగా ఈ విటమిన్ శరీరానికి చేరుతుంది. టాబ్లెట్లు, ఇంజెక్షన్లు తాత్కాలిక ఉపశమనం కలిగించినా, జీవన విధానంలో మార్పు చేసుకోవాలి. మట్టికి దగ్గరగా బ్రతకాలి. అయితే 
మట్టి గురించి చెప్పుకున్నప్పుడు ఈ బి 12 నేది చాలా చిన్న విషయం. మట్టిలో యోగిని అనే సూక్ష్మజీవులు ఉంటాయి. అవి శరీరానికి ఎంతో అవసరం. మన శరీరంలో మనకు మంచి చేసే రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అవి నిర్వర్తించే కార్యాన్ని అనుసరించి వాటికి పేర్లను నిర్ణయించారు ఋషులు. శరీరంలో కాళీ అనే సూక్ష్మక్రిములు ఉంటాయి. ఎలాగైతే ఆదిపరాశక్తి కాళీ రూపంలో దుష్టులను హతమార్చిందో అలా ఇవి రోగకారక క్రిముల పై పోరాడి వాటిని శరీరం నుంచి బయటకు పంపేస్తాయి. అందుకే వీటికి ఆ పేరు. అలాంటివే ఈ యోగిని కూడా. ఇది ఎంతో పెద్ద సబ్జెక్టు. కానీ ఈ యోగిని క్రిముల లక్షణం ఏమిటంటే ఇవి శరీరంలో బి12 ఉత్పత్తి జరిగేలా చూస్తాయి. ఇలాంటి క్రిములు కేవలం మంచి సారవంతమైన మట్టిలో చెప్పులేకుండా ఒట్టి కాళ్ళతో నడవడం చేత, తేమ కలిగిన పచ్చని ప్రాంతాల్లో నివసించడం చేత, పెద్ద పెద్ద, బాగా వయసున్న వృక్షాల దగ్గరకు వెళ్ళడం చేత, వాటి గాలిని పీల్చడం చేత శరీరంలోనికి ప్రవేశించి, రోగాలను నివారిస్తాయి. అదేకాకుండా ఆవుపేడతో కళ్ళాపి చల్లిన చోటా, ఆవుపేడ అలికిన కూడా ఈ యోగిని క్రిములు ఉంటాయి. (అప్పుడు నాకర్దమయ్యింది, మన సంప్రదాయంలో ఇల్లంతా పేడతో ఎందుకు అలుకుతారో, ఇంటి ముందు కళ్ళాపి ఎందుకు చల్లుతారో). ఇలా మట్టి ద్వారా, శాకాహారం ద్వారా వచ్చే బి12 మాంసాహారం ద్వార లభించే బి12 కంటే ఎంతో శ్రేష్టమైనది. శరిరంలో ఈ సూక్ష్మక్రిములు ఉంటే విషాన్ని సైతం జీర్ణం చేసుకుని అమృతంగా మార్చుకోవచ్చు. వారికి మంచి ఆలోచనా శక్తి ఉంటుంది, శారీరిక పుష్టి ఉంటుంది, ఆహారం జీర్ణం కాకపోవడమనేది వీరి విషయంలో ఒక పెద్ద జోక్. వీరికి అసలా బాధే ఉండదు. కాబట్టి మనం మన జీవన విధానాన్ని మార్చుకోవాలి, మట్టికి, మొక్కలకు దగ్గరగా జరగాలి'.

ఈ తరానికి తెలియదు కానీ ఒకప్పుడు మనమంతా మట్టిలో ఆడుకున్నవాళ్ళమే. అప్పుడు మనమేమీ చెప్పులు వేసుకోలేదు. ఎంతో హాయిగా గంతులు వేసేవారము. మనకంటే మన అమ్మనాన్నలు, తాతయ్యల చిన్నతనానికి వెళితే, వారు ఇంకా ఎన్నో ఆడుకునేవారు, పంటపొలాల్లో, చెట్ల మీద లేదా చెట్ల క్రింద. అందుకే వారు ఏ రోగం లేకుండా హాయిగా ఉన్నారు. వాళ్ళ శరీరంలో ఈ సూక్ష్మ క్రిములు అధికంగా ఉండేవి. అందుకే వారికి స్థూలకాయం రాలేదు, జీర్ణ సమస్యలు రాలేదు, మలబద్ధకం అసలే లేదు. కానీ ఇప్పుడున్న తరాన్ని చూస్తే, వారు మట్టికి దూరమయ్యి, అనేక రోగాలకు దగ్గరవుతున్నారు.

మృత్తికే దేహిమే పుష్టిం త్వయీ సర్వం ప్రతిష్టితం ..........................
(ఆ మృత్తికా, మాకు పుష్టినివ్వు, సర్వం నీలోనే ఉంది (ఈ శరీరానికి కావల్సిన విటమిన్లు కూడా))

మనం ఎంత చక్కగా ఆడుకున్నాం, ఆ రోజులే వేరు అని అనుకుంటూ ఉందామా లేక మన పిల్లల్ని వాటికి దగ్గర చేసి, వాళ్ళు జీవితాలు పండిద్దామా? మనం కూడా మళ్ళీ దగ్గరయ్యి ఆరోగ్యంగా జీవిద్దామా? లేకపోతే మందులు మింగుతూ ఇలానే ఉందామా?

To be continued ...........

Veda samskruti
Credit:Science Guru.

Kaushik Bhattacharya

No comments:

సంధ్యావందనము, గాయత్రి మంత్ర విశిష్టత

మహాభారతం, అశ్వమేధిక పర్వంలో, ధర్మరాజు కోరికపై శ్రీకృష్ణ భగవానుడు, *'సంధ్యావందనము, గాయత్రి మంత్ర'* విశిష్టతను ఈవిధంగా వివరించారు. &#...